Header Banner

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

  Sat Apr 19, 2025 12:43        Politics

వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ కోల్పోయింది. జీవీఎంసీ వైసీపీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. విశాఖ మేయర్ పీఠం కూటమి వశమయింది. ఈ ఉదయం 11 గంటలకు జీవీఎంపీ ఇన్ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ హరేంధిరప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభమయింది. ఇప్పటికే వైసీపీ కార్పొరేట్లర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో కూటమి బలం పెరిగింది. జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులు ఉన్నారు. ఈనాటి సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. వీరంతా అవిశ్వానికి మద్దతుగా ఓటు వేశారు. పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు వైసీపీ విప్ జారీ చేసినా వ్యూహం ఫలించలేదు. మరోవైపు కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. దీంతో, వైసీపీ మేయర్ హరి వెంకట కుమారి పదవిని కోల్పోయారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీ కార్యాలయం వద్ద కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని వేడుక చేసుకున్నారు.  

 

ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! పార్టీలోకి అడుగు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛత, తాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations